Summer Food:  సల్ల చారు.. ఉల్లి కారం.. వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచే వేరబ్బా..!

 Summer Food:  సల్ల చారు.. ఉల్లి కారం.. వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచే వేరబ్బా..!

ఎండాకాలం .. ఓ పక్క చిరాకు.. మరో పక్క కినెన్​ లో వేడి.. అబ్బో తట్టుకోలేకపోతున్నారు.. మహిళలు.. ఎక్కువ సేపు వేడి దగ్గర ఉండటం చాలా కష్టం .. అన్నం అయితే స్టవ్​ పై  పెట్టి టైం ప్రకారం చూసుకోవచ్చు.  కాని కూరలు అలా కాదుగా  అలా వండితే మాడిపోతాయిగా.. అందుకే చాలా తక్కువ సమయంలో వేడి లేకుండా సల్లచారు.. ఉల్లికారం  తయారు చేసుకోవచ్చు.  ఇప్పుడు వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . .! 


సల్ల చారు తయారీకి కావాల్సినవి:

 

  • చిక్కని మజ్జిగ ఒక కప్పు
  • పచ్చిమిర్చి: ఐదు
  • వెన్న: రెండు టేబుల్ స్పూన్లు
  • ఎండుమిర్చి: రెండు
  • జీలకర్ర: అర టీ స్పూన్
  • ఆవాలు: అర టీ స్పూన్
  • కరివేపాకు: రెండు రెమ్మలు
  • పసుపు, ఆవపిండి, శొంతిపిండి, వెల్లుల్లి ముద్ద:  ఒక టీ స్పూన్ చొప్పున

సల్ల చారు తయారీ విధానం 

మజ్జిగను ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మంటపై పచ్చిమిర్చిని కాల్చాలి.. వాటిని రోటిలో వేసి మెత్తగా దంచి మజ్జిగలో కలపాలి.

తర్వాత ఉప్పు, శొంఠిపొడి, ఆవాల పొడి కూడా వేసి కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి వెన్న వేడి చేయ్యాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి వేగించి మజ్జిగలో కలిపితే సల్ల చారు రడీ 

ఉల్లిపాయ కారం తయారీకి కావాల్సినవి

  • ఉల్లిగడ్డ తరుగు: ఒక కప్పు
  • జీలకర్రః ఒక టీస్పూన్
  • నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు
  • ధనియాలు: రెండు టేబుల్ స్పూన్లు
  • కరివేపాకు: రెండు రెమ్మలు
  • పచ్చిమిర్చి: ఆరు (సన్నగా తరిగి)
  • పసుపు: పావు టీస్పూన్
  • ఉప్పు, నూనె, నెయ్యి: తగినంత

ఉల్లి కారం తయారీ విధానం 

స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడిచెయ్యాలి. జీలకర్ర, నువ్వులు, ధనియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్ది సేపు వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు, పసుపు వేసి వేగించాలి.

►ALSO READ | ఆధ్యాత్మికం: హనుమజ్జయంతి పూజ.. గ్రహ బాధలకు పరిష్కారం.. ఆరోజు చేయాల్సింది ఇదే..!

అవి వేగాక కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ ఆపేయాలి. వేగిన మిశ్రమాన్ని మిక్సీ పట్టాలి. తర్వాత పోపు పెడితే 'ఉల్లిపాయ కారం 'సూపర్​ గా ఉంటుంది..

 దోసెలు.. ఇడ్లీల్లో తింటే బాగుంటుంది.  అలాగే అన్నంలో కూడా నెయ్యి వేసి కలుపుకొని తింటే సూపర్​ టేస్ట్​ ..